ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రం ప్రారంభం..

నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని డైనమిక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో స్థానిక కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ అధ్వర్యంలో ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్ కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డు కొత్తగా తీసుకోవాలని అనుకున్న ప్రతీ ఒక్కరూ ఈ ఆధార్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నూతన ఆధార్ కార్డు, ఆధార్ కార్డులో కరెక్షన్స్, మొబైల్ లింక్, ఫోటో మార్పిడి ఇతర సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 29వ తేది వరకు నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటారని చెప్పారు. కనుక ప్రతీ ఒక్కరు ఈ సేవలను సద్వినియోగించుకోగలరని స్థానిక కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దీప్ లాల్ చౌహన్, కాలనీ అధ్యక్షుడు వెంకట్ రావు, నర్సింహ చారీ, నర్సింహ రావు, లక్ష్మణ రావు తదితులు పాల్గోన్నారు.

Spread the love