శ్రీ సిటీ వద్ద CIEL గ్రూప్ కార్యాలయం ప్రారంభం

శ్రీ సిటీ వద్ద నూతన కార్యాలయం  ప్రారంభం
శ్రీ సిటీ వద్ద నూతన కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ హైదరాబాద్:  టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్, సిఐఇఎల్ గ్రూప్, చెన్నైకి ఉత్తరాన 50కిమీ దూరంలో ఉన్న స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీ అయిన శ్రీ సిటీలో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ విస్తరణతో శ్రీ సిటీలోని వ్యాపార సంస్థల కోసం ప్రతిభావంతుల కొరత సమస్యను తీర్చటం, హెచ్ఆర్ టెక్ ఆధారితమైన, వినూత్న హెచ్ఆర్ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఒక ప్రముఖ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తనను తాను నిలుపుకోవడానికి భారతదేశం సిద్ధమవుతున్నందున, సిఐఇఎల్ వివిధ పారిశ్రామిక క్లస్టర్ల లో జోనల్ హబ్‌లను నిర్మించడానికి కట్టుబడి ఉంది, తద్వారా ప్రతిభ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి గణనీయంగా దోహదపడుతుంది. తమ క్లస్టర్-అప్రోచ్ వ్యూహం ద్వారా విస్తృత శ్రేణిలో దేశవ్యాపంగా కార్యకలాపాలు నిర్వహించాలని సిఐఇఎల్ ప్రయత్నిస్తుంది. దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి కీలక సహకారిగా ఉంటుంది. భారత ప్రభుత్వ, MSDE జారీ చేసిన NAPS (నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్) లైసెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా విస్తృతంగా విస్తరించి ఉన్న టాలెంట్ పూల్స్ యొక్క ఒడిసి పట్టని సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్‌కి సిద్ధంగా వారిని తీర్చిదిద్దాలని సిఐఇఎల్ యోచిస్తోంది.
       రెండవది, ఫ్రంట్‌లైన్ సూపర్‌వైజర్ల  నుండి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, ఫంక్షనల్ నిపుణుల వరకు పరిశ్రమ విభాగాలలో సరైన ప్రతిభ యొక్క ఖచ్చితమైన అవసరాన్ని సిఐఇఎల్ గుర్తించింది. టాలెంట్ సొల్యూషన్స్‌లో దాని విస్తృత శ్రేణి పరిధి మరియు లోతైన నైపుణ్యం కారణంగా, సిఐఇఎల్ యొక్క కొత్త కార్యాలయం శ్రీ సిటీ, చుట్టుపక్కల ఉన్న కంపెనీల ప్రతిభ అవసరాలను తీర్చడానికి చక్కగా ఉపయోగపడనుంది.
Spread the love