నవతెలంగాణ – ఎల్లారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం.,లి.ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షులు ఏగుల నర్సిములు తన సంఘ పరిది లో గల బిక్కనుర్ గ్రామములో జొన్నలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్నలు మద్దతు ప్రభుత్వం ధర 2970 రూ. ఇస్తుంది అని వాతావరణ దృష్ట్యా కుప్పలను తడవకుండా కప్పుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు.దళారులకు అమ్మి మోసపోవద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, బాలరాజు,సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, భూమయ్య ఆయా గ్రామాల రైతులు , సొసైటీ సి ఈ ఓ విశ్వనాథం, ఇంచార్జ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు..