రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్‌ బుడమేరు’

Operation Budameru across the state– ఆక్రమణలపై మూడు శాఖలతో సర్వే
– రాజధాని నిర్మాణానికి భారీగా రుణ సేకరణ
– పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి : నదులు, చెరువుల ప్రారతాల్లో ఆక్రమణలను తొలగిరచేరదుకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆపరేషన్‌ బుడమేరు’ నిర్వహిరచాలని నిర్ణయిరచినట్లు రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొరగూరు నారాయణ తెలిపారు. బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణం, పట్టణాభివృద్ధి, నగరాల అభివృద్ధి తదితర అంశాలపై వివరించారు. బుడమేరు వాగు తరహాలో ఇకపై రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నష్టం రాకుండా చూసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రారతాల్లో అక్రమణల తొలగిరపు పక్రియ ప్రారంభమైరదన్నారు. ఆపరేషన్‌ బుడమేరులో భాగంగా నీటిపారుదల శాఖ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో ఆక్రమణలపై సర్వే నిర్వహిస్తున్నట్లు నారాయణ చెప్పారు. త్వరలోనే సర్వే నివేదికలు అందుతాయని, అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పబ్లిక్‌, ప్రయివేటు భాగస్వామ్యంతో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని పట్టణాల్లో తాగునీరు, పారిశుథ్యం వంటి అరశాలపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2027 నాటికి అన్ని ప్రారతాల్లో ఇరటికో కుళాయిని ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశుథ్య నివారణ, మురుగునీటి శుద్ధి కార్యక్రమాలపైనా చర్యలు తీసుకురటున్నట్లు ఆయన వివరిరచారు.
అమరావతిపై ప్రత్యేక దృష్టి
రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలిపారు. 2027 చివరి నాటికి అన్ని నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయిరచినట్లు చెప్పారు. ఈ నిర్మాణాలకు గతంలోనే దాదాపు 48 వేల కోట్ల రూపాయల టెరడర్లు పిలిచామని, ప్రస్తుతం వాటిని పూర్తిచేసేరదుకు ఐదు నురచి 10 శాతం అధిక వ్యయం అవుతురదని అరచనా వేసినట్లు తెలిపారు. కేంద్రం నురచి వచ్చే నిధులు కాకుండా హడ్కో, ప్రపంచబ్యారకు, జైకా, ఎఐబిపి నురచి రుణాలు సేకరిరచేరదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ఐకానిక్‌ టవర్లలోనే సిఎం కార్యాలయం
కొత్తగా నిర్మిరచే ఐకానిక్‌ టవర్లలోనే సిఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తం ఐదు భారీ టవర్లను నిర్మిరచనున్నామని, అరదులో ముఖ్యమంత్రి ఉరడే టవర్‌లో 54 అరతస్తులు ఉరటాయని చెప్పారు. మిగిలిన టవర్లలో 46 అరతస్తులు ఉరటాయన్నారు. సచివాలయానికి సంబంధించిన కార్యదర్శులు, అధికారులతో పాటు, అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు కూడా ఈ టవర్లలోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పనుల కోసం వచ్చే వారికి ఎక్కడెక్కడో తిరిగే శ్రమ తప్పుతురదన్నారు. వీటి నిర్మాణాలను రెండన్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వరదల నివారణకు నెదర్లాండ్స్‌ డిజైన్లు
రాజధాని ప్రారతంలో వరదలను నివారించడానికి, నీటి ఒత్తిడిని తట్టుకునేందుకు నెదర్లారడ్స్‌ సిఫార్సులు, డిజైన్లను అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. దీనికోసం 200 సంవత్సరాల నాటి వరద డేటాను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఈ డిజైన్లు నెలాఖరులోగా ఖరారవుతాయన్నారు. వీటిలో ఆరు రిజర్వాయర్ల నిర్మాణం, వరద నీరు ఎక్కువగా వచ్చినా తట్టుకునే నిల్వ సామర్థ్యం వంటివి కూడా ఉరటాయని చెప్పారు.అమరావతి నిర్మాణానికి సంబంధించి పాత టెరడర్లను రద్దు చేసి, కమిటీ నివేదిక మేరకు కొత్తగా పిలువనున్నట్లు తెలిపారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, డిసెరబర్‌లోగా కొత్త టెండర్లను ఖరారుచేసి జనవరి నురచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Spread the love