నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ను చేస్తున్నారు. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.