మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసుకునే రైతులకు మంచి అవకాశం వచ్చిందని, కావలసిన రైతులు తమను సంప్రదించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సంగీత పేర్కొన్నారు. బుధవారం వారం మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగపడుతుందన్నారు.ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. అలాగే కవ్వాల్ క్లస్టర్ పరిధిలో రైతులకు ఆయిల్ ఫామ్స్ సాగుపై ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, క్లస్టర్ ఏ ఈ ఓ అక్రమ్ తెలిపారు. ఈ క్లస్టర్లో ఆయిల్ ఫామ్ సాగు చేసుకునే రైతుల తమను సంప్రదించాలన్నారు.