– మంత్రి హరీశ్‌రావుకు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ విధానా (ఓపీఎస్)న్ని అమలు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీ ఆమోదం మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన హెల్త్ స్కీంను అమలు చేయా లని కోరారు. ఆర్థిక శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యా యుల బిల్లులన్నింటినీ విడుదల చేయాలని తెలిపారు. త్వరలోనే సంఘాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి హెల్త్ స్కీం విధివిధానాలను నిర్ణ యిస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజిరెడ్డి, గౌరవాధ్యక్షులు పర్వతి సత్యనారాయణ, కోశాధికారి చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.