నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్‌కతాలో జూ.డాక్టర్‌ను రేప్ చేసి చంపిన ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. దీనిపై జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. ఇవాళ ఆందోళనలో పాల్గొననున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. కాగా కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన చేస్తున్నారు.