ఆరెంజ్‌ ఫేస్‌ప్యాక్‌…

Orange Facepack...కత్రిమ లోషన్లు, క్రీములూ ముఖానికి అప్లై చేయించుకొని సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే ఉంటూ అదిరిపోయే ఫేస్‌ ప్యాక్‌ చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే పండ్లతోనే చాలా వెరైటీస్‌ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే పండ్లలో సహజ సిద్ధంగా ఉండే విటమిన్లు, మినరల్సూ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నారింజ పండ్లు చర్మం మెరిసేలా చేస్తాయి. ఫేస్‌ప్యాక్‌ తయారీకి కావాల్సినవిమూడు టీస్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌, రెండు టీస్పూన్ల అలోవెరా (కలబంద) గుజ్జు, టీస్పూన్‌ గ్లిజరిన్‌.తయారు చేసే విధానంపైన చెప్పుకున్న మూడింటినీ ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. అది పేస్టులా అయ్యాక ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలు అలా ఆరనివ్వాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఉపయోగాలు ఎ ఆరెంజెస్‌, ఆలోవెరా, గ్లిజరిన్‌ ఈ మూడింటిలోనూ చర్మాన్ని మదువుగా, మెరిసేలా చేసే గుణాలుంటాయి. ఇవి చర్మంలో పొడిదనాన్ని తగ్గిస్తాయి. అందువల్ల చర్మం నిగారిస్తుంది. ఎ ఆరెంజ్‌ ఫేస్‌ ప్యాక్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి చర్మ కణాల్ని కాపాడి, మతకణాల్ని తరిమేసి ముడతల్ని పోగొడతాయి. చర్మంపై చిన్నదైనా, పెద్దదైనా గాయం ఉన్నచోట ఈ ప్యాక్‌ అప్లై చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.- విటమిన్‌ సి కారణంగా ఈ ప్యాక్‌ బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. అంటే చర్మంపై అవసరం లేని కణాలను పంపేయడం, కొత్త కణాలు వచ్చేలా చేయడం వంటివి జరుగుతాయి. అందువల్ల చర్మం మెరుస్తుంది. ముఖ్యంగా ఆరెంజెస్‌, అలోవీరా ఈ రెండూ… చర్మాన్ని క్లీన్‌ చేయడంలో బాగా పనిచేస్తాయి. ముఖంపై మచ్చలు ఉంటే పోగొడతాయి. కాబట్టి వారాలకు ఒక్కసారైనా ఈ ప్యాక్‌ అప్లై చేసుకుంటే మంచిది.

Spread the love