ఉపాధ్యాయుడుని సస్పెన్స్ చేస్తూ జారీ అయిన ఉత్తర్వులు

– ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్
నవతెలంగాణ – అశ్వారావుపేట : విద్యార్ధుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మోహనరావు విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించి పైశాచిక అనందం పొందాడు. విద్యార్థుల దుస్తులు విప్పించి సెల్ఫోన్ లో ఫోటోలు చిత్రీకరించాడు.దీనిపై బాధిత విద్యార్థుల తల్లితండ్రులు గత నెల 30వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి పై కేసు నమోదు కావటంతో పాటు పత్రికల్లో వచ్చిన కధనాలు,పోలీస్,మండల విద్యాశాఖాధికారి నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడిని సస్పెన్షన్ చేస్తున్నట్లు డి.ఈ.ఒ వెంకటేశ్వరా చారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అలాగే తదుపరి చర్యలు నిమిత్తం నారాయణపురం హెచ్.ఎం పద్మావతి కి ఉత్తర్వుల కాపీని పంపించారు.ఈ విషయాన్ని ఎంఈవో పి.కృష్ణయ్య ధృవీకరించారు.
Spread the love