నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. విభాగాల వారీగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం శుక్రవారం ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది.
జీవో ప్రకారం ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలివే…
ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం.
బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30శాతం.
సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ. 150 చెల్లింపు.
షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్ 30శాతం.
వికలాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీనియన్స్ అలవెన్స్ రూ. 2వేల నుంచి రూ. 3వేలకు పెంపు.
ఇండ్లు నిర్మించుకునే ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచుతూ నిర్ణయం.
కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంపు.
మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ రూ.80వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతూ నిర్ణయం.
ఉద్యోగుల పిల్లల వివాహాలకు సంబంధించి.. కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. లక్ష నుంచి రూ. 4 లక్షలకు పెంపు.
కుమారుడి పెండ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెరిగింది.
స్టేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం.
గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు
ఇచ్చే స్పెషల్ అలవెన్స్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపజేయాలని నిర్ణయం.
పెన్షనర్లు మరణిస్తే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30వేలకు పెంపు.
ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం 2.73 శాతం డీఏ ప్రకటించింది. తాజాగా మరింత ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విభాగాల వారీగా ఆదేశాలు జారీ చేసింది.