అవసరమైతే హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయండి

డీఎంహెచ్వో శిరీష
నవతెలంగాణ-పినపాక
జ్వరాలు ఎక్కువగా ఏ గ్రామంలో అయితే నమోదు అవుతున్నాయో ఆ గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు వెంటనే ఏర్పాటు చేయాలని డిఎంహెచ్వో శిరీష వైద్య అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. రికార్డులను ఆరోగ్య మహిళ ప్రోగ్రాం జరుగుతున్న తీరును పరిశీలించారు. పీహెచ్‌సీలోనే మహిళలకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తున్నామని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు. వర్షాకాలం వచ్చే జ్వరాలు విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మెడిసిన్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ దుర్గాభవాని హాస్పటల్లో ఎదురవుతున్న సమస్యలను డిఎంహెచ్వో వివరించారు. పరిసరాల పరిశుభ్రత జ్వరాల పై ప్రజలను ఆరోగ్య సిబ్బంది చేత అవగాహన కల్పించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాలకు నీటి నిల్వలు ఉంటే లార్వాలు ఉత్పత్తి అవుతాయని తద్వారా డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలు వస్తాయని వివరించి,పారిశుధ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి పర్ష నాయక్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశాలు, పాల్గొన్నారు.

Spread the love