మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలను ఓఎస్డీ సందర్శన

నవతెలంగాణ-మహాదేవపూర్‌
భూపాలపల్లి, ములుగు జిల్లాల ఓఎస్డీ అశోక్‌ కూమార్‌ జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐపీఎస్‌ బృందాన్ని తీసుకొని మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలలో ని పోలీస్‌ స్టేషన్లను బుధవారం సందర్శించారు. పీఎస్‌లను భద్రత విషయాలను, అంతర్రాష్ట్ర బార్డర్‌ చెక్‌ పోస్ట్‌ లకు సంబంధించిన విషయాలను ట్రైనీ ఐపీఎస్‌ బృందానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్‌ రెడ్డి, మహదేవపూర్‌ సిఐ కిరణ్‌కుమార్‌, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్‌ రావు, మహదేవపూర్‌ ఎస్సై రాజ్‌ కుమార్‌ పలిమెల ఎస్సై థామస్‌ రెడ్డి ఉన్నారు. సందర్శన అనంతరం కాళేశ్వరం నూతన పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు నాటారు. వారి వెంట సివిల్‌ సిఆర్పిఎఫ్‌ పోలీసులు ఉన్నారు

Spread the love