ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా..

ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా..నాని నటిస్తున్న పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌ ‘హారు నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్‌ మొదటి ప్రొడక్షన్‌ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లేటెస్ట్‌గా ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ని మేకర్స్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చూసుకున్నపుడు ‘వీడెవడో బావున్నాడు’ అని అనిపించింది ఈ సినిమాకే (నవ్వుతూ). శౌర్యువ్‌ రాసుకున్న కథలో సాన్‌ జాన్‌ చూపించిన విజివల్స్‌లో చాలా బావుంటాను. టీజర్‌, పాటలు ఇప్పుడు ట్రైలర్‌ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత ఉంది. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం. సినిమా అనేది నాకు ఆక్సిజన్‌తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా. డిసెంబర్‌ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ భాద్యత నాది, మా టీం అందరిది. బాక్సాఫీసు బాధ్యత మీది. ఓ మంచి సినిమాతో మీముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’ అని తెలిపారు. ఈ వేడుకలో రైటర్‌ కాశి, దర్శకుడు శౌర్యువ్‌, నిర్మాత మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డితోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా పాల్గొన్నారు. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని, మణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా ఖన్నా ముఖ్య పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్‌ వరుగుస్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంటోని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – సతీష్‌ ఈవీవీ.

Spread the love