– కార్పొరేటర్ గీత
నవతెలంగాణ- ఉప్పల్
ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని కార్పొరేటర్ గీత అన్నారు. శుక్రవారం చిల్కానగర్ డివిజన్‌లో ఎలక్ట్రికల్ పోల్ కింది నుండి వాటర్ పైప్‌లైన్ లీకేజ్ అయిన విషయం కార్పొరేటర్ దృష్టికి వచ్చింది. వెంటనే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ సత్యనారాయణ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈని కార్పొరేటర్ సంప్రదించి..వెంటపెట్టుకొని అక్కడికి చేరుకుంది. అంతేకాదు లీకేజ్ అవుతున్న వాటర్ పైప్ లైన్‌ను వెంటనే మరమ్మతు చేయించింది. తర్వాత జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్ ఏఈ తో మాట్లాడి నూతన కరెంటు పోల్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తనకు నేరుగా తెలపాలని కోరారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, బాలేందర్, ఎండీి షఫీ, ఎండీ హనీఫ్, నరేష్, ఘోస్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.