– పట్టించుకోని ఎంఈఓ…ఆందోళనలో విద్యార్థులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కోతుల బెడద నుంచి మా పిల్లలను రక్షించాలని తల్లిదండ్రులు మండల విద్యాధికారికి 20న వినతిపత్రాన్ని అందజేశారు. ఎంఈఓ మాత్రం వారి వినతిని పట్టించుకోలేదు. పూర్తి వివరాల ప్రకారం మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిత్యం కోతల బెడద ఎక్కువైపోవడంతో విద్యార్థులు పాఠశాలకు రావాలంటే జంకుతున్నారు. పాఠశాలలో చెట్లపై కోతులు తిష్టవేసి విద్యార్థులపై దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులను పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆ చిన్నారులు వారి తల్లిదండ్రులకు పిర్యాదు చేశారు. వెంటనే పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్మన్ అరవెండి పద్మ,తల్లిదండ్రులు ఎడ్ల రవికుమార్,డి.ఇన్ సాన్, చెద సమ్మయ్య,సంతిసపు రాజిరెడ్డి,జాఫర్ ఖాన్,కొమురోజు శ్రీనివాస్ చారి, లకావత్ రాజేందర్ తదితరులు ఈనెల 20న పాఠశాలలో చెట్ల కొమ్మలను తొలగించాలని,కోతల బెడద నుంచి మా పిల్లలకు రక్షించాలని మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తిని ఎంఈఓ ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కోతులతో పిల్లలకు. ఏదైన ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరాని పలువురు ప్రశ్నిస్తున్నారు.