మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం

ఆదర్శ ఆస్పత్రి డాక్టర్‌ శ్రీకాంత్‌
గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యం అని వికారాబాద్‌ పట్టణంలోని ఆదర్శ ఆస్పత్రి డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. డాక్టర్స్‌ డే సందర్భంగా నవ తెలంగాణ ప్రతినిధి రవీందర్‌తో ఆయన మాట్లాడారు.
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
‘ఈ ప్రాంత వాసినైన నేను ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వికారాబాద్‌ పట్టణంలో ఆస్పత్రి నెలకొల్పాను. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాం. 2021 సె ప్టెంబర్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేశాం. నాటి నుంచి నేటి వరకు సుమారు 30 నుంచి 40 వరకు వివిధ రకాల ఆపరేషన్లు చేశాం. నార్మల్‌ డెలివరీ చేయడం లో మా ఆస్పత్రి ముందంజలో ఉంది. ఆపరేషన్‌ చేయకుండా నార్మల్‌ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు నార్మల్‌ డెలివరీ చేశాం. స్తోమత లేని రోగులను కూడా ఉచితంగా పరిశీలించి, సూచనలు, సలహాలు ఇస్తున్నాం. రోగాన్ని నిర్ధారించి నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. 24 గంటలు వివిధ రకాల వైద్యులు మా ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయి.
అర్ధరాత్రి వచ్చినా ఎలాంటి రోగినైనా మా ఆస్పత్రిలో పరిశీలించి వైద్యం అందించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. మా ఆస్పత్రికి వచ్చిన రోగిని పరీక్షించి తీవ్రతను బట్టి ఇక్కడే ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌ రిఫరెన్స్‌ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అందులో భాగంగానే మా ఆస్పత్రి ఆ ప్రయత్నం చేయడంలో ముందుంది. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని తరగతుల వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఈ ప్రాంత వాసిని నేను ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నా.
నాతోపాటు లివర్‌ పేగులు జీర్ణాకోశ సంబంధిత నిపుణులు డాక్టర్‌ వినోద్‌ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ సంతోష్‌ మాత, డాక్టర్‌ మహేష్‌, జనరల్‌ ఫిజిక్స్‌ సంగమేష్‌, డీఎంఓ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్‌ శ్వేత ఆదర్శ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంటారు. గుండె, మెదడు, కిడ్నీ, లివర్‌, ఊపిరితిత్తులు, థైరాయిడ్‌, పసిరికలు, మైగ్రేన్‌, ఫోటో షుగర్‌, అధిక రక్తపోటు, ఫిట్స్‌, మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా, నరాల సంబంధిత వ్యాధులు, ఆస్తమా, దమ్ము, తిమ్మిర్లు, క్యూబెట్టమ్మి తోపాటు అనేక రకాల వ్యాధులకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తాం. ప్రజలు ఎప్పుడైనా రోగాలపడిన పడిన మా వద్దకు వస్తే సాధ్యమైనంతా వరకు నాణ్యమై న వైద్యాన్ని అందించేందుకు కృష చేస్తాం. రోగి తీవ్రతను బట్టి వైద్యం అంది స్తాం. డాక్టర్‌ సందర్భంగా జులై ఒకటో తారీఖున వాకర్స్‌ వారికి ఉచితంగా వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలి’ అని డాక్టర్‌ శ్రీకాంత్‌ సూచించారు. అందరికీ డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love