ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆత్మహత్య.. నా చావుకు ఆ ఇద్దరే కారణం

నవతెలంగాణ – హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖాన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి జయంత్(22) ఆత్మహత్య పాల్పడ్డాడు. తన చావుకు కారణం దవాఖాన సూపరింటెండెంట్‌ రంగనాథ్‌, ఎస్‌ఐ మైబెల్లి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఇబ్రహీంపట్నం శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love