న్యూఢిల్లీ : మ్యూజింగ్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫైలో మరోమారు ఉద్యోగులను తొలగించారు. ఐదు నెలల క్రితమే 600 మంది సిబ్బందిని ఇంటికి పంపించిన ఈ సంస్థ తాజాగా మరో 200 మందిపై వేటు వేసింది. స్ధూల ఆర్ధిక పరిస్ధితులను సాకుగా చూపి తొలగింపులకు పాల్పడింది. పాడ్‌కాస్ట్ డివిజన్‌లో వ్యవస్థాగత మార్పుల ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పాటిఫై పాడ్‌కాస్ట్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ సహర్ ఎలబషి పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి స్పాటిఫై అండగా ఉంటుందని, వారి పట్ల గౌరవంగా, సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు.