మెటాలో మళ్లీ 6,000 మందిపై వేటు

న్యూయార్క్‌ : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్స్‌స్ట్రాగ్రామ్‌ మాతృ సంస్థ మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగుల తొలగింపునకు పాల్పడింది. వచ్చే వారం నుంచి 6000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది మేలో తదు పరి దశ ఉద్వాసనలు ఉంటాయని మెటా సిఇఒ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ఆ దిశగా నిర్ణయం తీసుకుందని రిపోర్టులు వస్తున్నాయి. పొదుపు చర్యల్లో భాగంగా గతేడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను మెటా తొలగించింది. మరో 10,000 మంది ఉద్యోగు లపై వేటు వేస్తున్నట్లు ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించింది. మూడో దఫా తొలగింపు ప్రక్రియ వచ్చే వారం నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది.

Spread the love