నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జమిలి నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. జమిలి ఎన్నికలతో దేశం సర్వనాశనం అవుతుందని, మోడీ, అమిత్ షాలకు మాత్రమే ఈ ఎన్నికలతో అబ్ధి చేకురుతుందని, దేశంలో బీజేపీ మాత్రమే ఈ జమిలి ఎన్నికలను సమర్ధిస్తుందని, కేంద్ర నిర్ణయం ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని రాజీ చేస్తుందన్నారు. అలాగే జమిలి ఎన్నికలు జరిగితే.. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం వారికి ఉన్నందున మనకు ఏకకాల ఎన్నికలు అవసరం లేదని.. తరచుగా, ఆవర్తన ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని మెరుగు పరుస్తాయి అని ఎంపీ అసదుద్దీన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.