తెలుగులో పా..పా..

Pa..Pa.. in Teluguతమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘దా…దా…’. ఈ చిత్రాన్ని కన్నడలో ఒలింపియా మూవీస్‌ సంస్థ ఎస్‌.అంబేత్‌ కుమార్‌ సమర్పించగా తెలుగులో నీరజ సమర్పిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీస్‌, జె కె ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా ఎమ్మెస్‌ రెడ్డి నిర్మాతగా శ్రీకాంత్‌ నూనెపల్లి, శశాంక్‌ చెన్నూరు సహ నిర్మాతలుగా దీన్ని ‘పా…పా…’గా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ, ‘తమిళంలో మంచి యూత్‌ఫుల్‌, లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన ‘దా…దా…’ని ‘పా…పా…’గా తెలుగులో తీసుకొస్తున్నాం. అతి త్వరలో గ్రాండ్‌గా ట్రైలర్‌ లాంచ్‌ చేస్తాం’ అని తెలిపారు.

Spread the love