బాధ్యతలు చేపట్టిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఇప్ప మొండయ్య బుధవారం పిఏసిఎస్ కార్యాలయంలో చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు అందాల్సిన పంట రుణాలు, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్కా సూర్య ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love