మృతుల కుటుంబాలకు పాడి కౌశిక్ రెడ్డి పరామర్శ..

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని వల్బాపూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వల్బాపూర్ గ్రామానికి చెందిన కామిడి వజ్రమ్మ, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోతరవేన సమ్మయ్య మృతి చెందారు. కాగా వారి కుటుంబ సభ్యులను కౌశిక్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట వీణవంక, ఇల్లంతకుంట ఎంపీపీలు ముసిపట్ల రేణుకా తిరుపతిరెడ్డి, ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేష్, రామకృష్ణాపూర్ సర్పంచ్ మేకల సమ్మిరెడ్డి, ఎంపీటీసీ జడల పద్మలత రమేష్, పీఏసీఎస్ డైరెక్టర్ కామిడి కావ్యశ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ కాసాని కవితాశ్రీనివాస్, నాయకులు బొబ్బల సమ్మిరెడ్డి, పొరెడ్డి తిరుపతిరెడ్డి, నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love