నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్..

నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి .అరుదైన గౌరవం కల్పించింది. బాలకృష్ణతో పాటు విద్య, సాహిత్య విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళల విభాగంలో మాడుగుల నాగఫణిశ్మకు పద్మశ్రీ, సాహిత్యంలో వద్దిరాజు రాఘవేంద్ర చార్యకు పద్మశ్రీ, ఏపీకి చెందిన మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ ప్రకటించారు.

Spread the love