ఆత్మగౌరవ సభకు బయలుదేరిన పద్మశాలి

– సామాజిక వర్గ రాజ్యాధికార సాధనే నినాదంతో..
నవతెలంగాణ- భీమారం: ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి కులస్తుల ఆత్మగౌరవ సాధన లక్ష్యంతో చలో కొరుట్ల యుద్ధభేరికి భారీగా తరలి వెళ్లారు. ఆదివారం కోరుట్లలో పద్మశాలీల రాజ్యాధికార సాధన లక్ష్యంగా నిర్వహించనున్న ఈ సభకు సుమారు లక్ష మందితో తమ ఆస్తిత్వాన్ని చాటి చెప్పాలని పద్మశాలి సోదరులు కదం తొక్కారు. దీంతో భీమారం మండలం నుంచి సుమారు 150 మందితో చలో కొరుట్ల బయలుదేరారు. బీసీ క్యాటగిరి నుంచి అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు గుర్తింపు, సమన్యాయ నిర్ణయాలు తీసుకునే శాసనసభ సమావేశ నిర్ణయాలలో గొంతు కలిపేందుకు అవకాశ సాదనే ధ్యేయంగా ఈ సభ ద్వారా తెలియ చెప్పాలని నిర్ణయంతో ఈ భారీ సభను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అస్తిత్వం కలిగి అనాదిగా వస్తున్న వస్ట్రోత్పత్తి తో పాటు అనేక రంగాలలో పద్మశాలీల సృజనాత్మకతకు జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో తమదైన స్వరం ఎలిగెత్తేందుకు రాజ్యాధికార సాధన కోసం ప్రతి గడప నుండి తరలి వెళ్లాలని కంకణబద్ధులై తరలి వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవిడపు వెంకటేశం, అధ్యక్షులు గుడిమల్ల వెంకటేశం, బాసాని పోషం, బండి తిరుపతి, ఉపాధ్యక్షుడు గుడిమల్ల నరహరి, సెక్రటరీ బండి శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు మధు, సత్యనారాయణ, సమ్మయ్య, శ్రీనివాస్, గౌరయ్య పాల్గొన్నారు.
Spread the love