అయ్యప్ప దేవాలయంలో పదునెట్టంబడి మహా పడిపూజ…

Maha Padi Puja in Ayyappa Temple– దేవరపల్లి గోవర్ధన్ రెడ్డిగురుస్వామి
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ అయ్యప్ప దేవాలయంలో  పదునెట్టంబడి మహా పడిపూజను దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించారు.మహా పడిపూజను బొబ్బిళ్ళ మురళి గురుస్వామి కరకమలముల చేత  నిర్వహించారు.ఈ సందర్భంగా బొబ్బిళ్ళ మురళి గురుస్వామి మాట్లాడుతూ శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి వారి పదునెట్టాంబడి పూజ నిర్వహిస్తే భక్తులు తెలిసి తెలియక చేసిన  తప్పు ఒప్పులను  నుండి మానవుడు స్వామి దయతో విముక్తి పొందుతారని తెలిపారు.తర్వాత దైవ మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల ప్రతి జీవి పట్ల ప్రేమానురాగాలు అందిస్తూ మళ్లీ తప్పులు చేయకుండా జీవనం గడపాలని బొబ్బిల మురళీ గురుస్వామి కోరారు. మహా పడిపూజ నిర్వహించిన దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప మాల వలన మనకు ఎన్నో ఆదర్శ భావాలు ఏర్పడతాయని,కులాలకు అతీతంగా ప్రతి వ్యక్తిని అయ్యప్పస్వామి అని సంబోధిస్తూ స్వామి అని పిలిచి అయ్యప్పస్వామి నామం శరణమయ్యప్ప అని నామస్మరణ చేస్తూ ఉంటే మన శరీరంలో అదో మధురానుభూతి కలుగుతుందన్నారు.మాల వేసుకున్న ప్రతి అయ్యప్ప భక్తుడు మాల వేసుకున్న సమయంలో చెడు వ్యసనాలు వదిలిపెట్టి ఎలా దీక్ష చేస్తామో మల విసర్జన చేసిన తర్వాత కూడా అలాగే స్వామివారి నామం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ మాల వేసుకున్న తరువాత అయ్యప్ప భక్తులకు వారి ప్రవర్తనలో ఇంత మార్పు వస్తుందా అనే విధంగా మనం నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్ 18 వ వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ గురుస్వామి గురుస్వాములు T.శంకర్ చింతల సాయిలు ఉప్పు ఆంజనేయులు అంతటి రాము గౌడ్ సుక్క సుదర్శన్ పెద్దగోని రమేష్ గౌడ్, కంచరకుంట్ల శశికాంత్,బోరెం రాజశేఖర్ రెడ్డి, గుత్తికొండ సుధీర్ కుమార్ కిలారి వెంకటరమణ  ఉస్కగుల నాగరాజుగౌడ్ బొడ్డు రాజేందర్ రెడ్డి బొరేం దయాకర్ రెడ్డి రామకృష్ణ దేప అనిల్ పల్సం రాజేష్ గౌడ్ పాశం కృష్ణ పాలమకుల అశోక్ దోర్నాల పాండు కడారి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Spread the love