నవతెలంగాణ-జనగామ
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరుగుతు న్న అభివద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిజెపి కాంగ్రెస్ పార్టీలు విష య కక్కుతున్నాయని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ ార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివద్ధి పనులు నిర్వ హిస్తుంటే సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం అవివేకం అన్నారు. కాంగ్రెస్ బి జెపి పాలిత రాష్ట్రాల్లో అమల్లో లేని పలు అభివద్ధి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పేరిట బిజెపి,17నిర్వహించిన కాంగ్రె స్ సభలో ఆయా పార్టీల అధినేతలు ఎటు పాలు పోక సీఎం కేసీఆర్ ను విమర్శిం చారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది అన్నారు. గత కాంగ్రెస్ బిజెపి పాలనలోనే దేశంలో పలు కుంభకోణాలు జరిగాయన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు కక్ష సాధింపు ధోరణితో సీఎం కేసీఆర్ పై విషం కక్కుతు న్నారని విమర్శించారు.తెలంగాణలో సీఎంకేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉందన్నా రు. మూడోసారి ముచ్చటగా కెసిఆర్‌ను సీఎం చేసి ప్రజల హ్యాట్రిక్ కొట్టనున్నార న్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అభ్యర్థులు డిపాజిట్ గల్లంతవు తుందన్నారు. కాంగ్రెస్‌లోనే కుమ్ములాటలతో సరిపెట్టుకుంటుందన్నారు. అభివ ద్ధికి సోపాన బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు సహించరని, త గిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పి జమున, మున్సిపల్ కౌన్సిలర్లు బండ పద్మ, పగిడిపాటు సుధా, వాంకుడోత్ అనిత, జన గామ ఎంపీపీ మేకల కలింగరాజు, జెడ్పిటిసి నిమ్మతి దీపిక, రఘునాథ్‌పల్లి మండ లం టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వారాల రమేష్, జనగామ మాజీ ఎంపీపీ యాదగిరి, నాయకులు సిరివెల్లి లింగం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.