పైసా వసూల్‌ సినిమా

Paisa Vasool movieనిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్‌లైట్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల6న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఏ ఎం రత్నం, అంబికా కష్ణ, దర్శకుడు అనుదీప్‌లు ఈ వేడుకలో ప్రత్యేక అతిథులుగా అలరించారు.
ఈ సందర్భంగా నిర్మాత మురళీకష్ణ వేమూరి మాట్లాడుతూ, ‘నిర్మాణరంగంలో ఏ.ఎం.రత్నం మాకు అండగా ఉన్నారు. దర్శకుడు వర్క్‌హాలిక్‌ పర్సన్‌. కిరణ్‌, నేహశెట్టి బాగా యాక్ట్‌ చేశారు’ అని తెలిపారు.
‘కిరణ్‌ అబ్బవరంతో భవిష్యత్తులో మరో సినిమా చేస్తా. ఆ సినిమాను నేనే డైరెక్ట్‌ చేస్తా. ఈ సినిమా మాత్రం పెద్ద హిట్‌ అవుతుంది’ అని ఎ.ఎం.రత్నం అన్నారు. నాయిక నేహాశెట్టి మాట్లాడుతూ, ”కథ విన్నాక ఎంతో నవ్వుకున్నాను. నేను పోషించిన రాధిక పాత్ర తర్వాత అంతగా గుర్తింపు తెచ్చే చిత్రమిది. పక్కా పైసా వసూల్‌ చేస్తుంది’ అని చెప్పారు. ‘ఇది పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. కాలేజ్‌ పూర్తిగా కాగానే ఎవరికైనా జాబ్‌, శాలరీ, ఆ తర్వాత అందమైన లవర్‌ కావాలనుకుంటారు. అలాంటి కథను ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో చెప్పాం. సక్సెస్‌పరంగా నేను సిక్స్‌ కొట్టడానికి దొరికిన లాస్ట్‌ బాల్‌ ఇది. తప్పకుండా సిక్సర్‌ కొడతా’ అని దర్శకుడు రత్నం కష్ణ అన్నారు.
హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘స్టార్‌లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మంచి సినిమా తీశారు. పూర్తిగా వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేహాశెట్టి చాలా సపోర్టివ్‌ హీరోయిన్‌. దర్శకుడు రత్నం కష్ణ పట్టువదలని విక్రమార్కుడు. నేను నటించిన ఫస్ట్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ అంతా దర్శకుడికే చెందుతుంది. ఈనెల 6న వస్తున్న ఈ చిత్రానికి కుటుంబ సమేతంగా చూడండి. గడిచిన మూడేళ్లగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశా. ఆ సమయంలో అభిమానులు అండగా ఉన్నారు. అభిమానులు ఇచ్చిన సపోర్ట్‌కు ఏడాది సమయంలో మంచి విజయాలను అందిస్తా. అందరూ గర్వించేలా చేస్తాను’ అని అన్నారు.

Spread the love