నవతెలంగాణ – ఖేమ్‌కరన్: పంజాబ్‌లో సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు.. పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను పట్టుకున్నారు. ఆ డ్రోన్ ద్వారా సుమారు మూడు కిలోల హెరాయిన్‌ను సరఫరా చేస్తున్నారు. బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్‌తో పాటు పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. టార్న్ తరన్ జిల్లాలోని ఖేమ్‌కరన్ గ్రామంలో పోలీసులు ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంట పొలాల్లో డ్రోన్‌ను సీజ్ చేశారు. ఎల్లో రంగు టేప్ చుట్టి డ్రోన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో పాక్ నుంచి వస్తున్న అనేక డ్రోన్లను జవాన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.