పక్కా కమర్షియల్‌గా జాలరి

పక్కా కమర్షియల్‌గా జాలరిశ్రీహరి హీరోగా రాజ్‌ తాళ్లూరి డైరెక్షన్‌లో మై3 బాక్సాఫీస్‌ బ్యానర్‌లో రెండవ చిత్రం ‘జాలరి’ ప్రారంభమైంది. ఐదు భాషల్లో నిర్మించనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అలేఖ్య ఫార్మ్‌ వుడ్స్‌ జరిగింది. పూజ అనంతరం హీరో వెంకట్‌ క్లాప్‌ కొట్టగా, డైరెక్టర్‌ సముద్ర కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసి, స్క్రిప్ట్‌ మేకర్స్‌కి ఇచ్చారు. ఈ వేడుకలో నిర్మాతలు ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్‌ బత్తుల, రక్తం దశరథ్‌ గౌడ్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హీరో శ్రీహరికి ఇది రెండో సినిమా కాగా, డైరెక్టర్‌ రాజ్‌ తాళ్లూరికి మూడవ సినిమా. ఇది 80ల బ్యాక్‌డ్రాప్‌లో కమర్షియల్‌ ఫార్మాట్‌ సినిమాగా తెరకెక్కనుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రారంభం కాన్న్ను ఈ సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకర్షిస్తుందన్న నమ్మకాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తం చేశారు.

Spread the love