పాల పిట్టల్లె ప్రేమే వాలె

పాల పిట్టల్లె
ప్రేమే వాలెచైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఈ సినిమా త్వరలో థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ లిరికల్‌ సాంగ్‌ను దర్శకుడు దేవ కట్టా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ‘ చైతన్య నాకు బాగా ఇష్టమైన యాక్టర్‌. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్‌ చేసిన టీజర్‌, మ్యారేజి సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ కంటెంట్‌ చూస్తుంటే ఇదొక మంచి రూటెడ్‌ మూవీగా అర్థమవుతోంది. సైలెంట్‌ గా రిలీజ్‌ కు వచ్చి పెద్ద సక్సెస్‌ అయ్యే సినిమాలా అనిపిస్తోంది’ అని చెప్పారు. ‘ఇది నాకు బాగా ఇష్టమైన సినిమా దేవ కట్టా అన్నట్లు సైలెంట్‌గా థియేటర్స్‌లోకి వచ్చి సక్సెస్‌ అందుకోబోతున్నాం. ఈ సాంగ్‌ లిరిక్స్‌ గమ్మత్తుగా ఉంటాయి. మనం మాట్లాడుకునే మాటల్లాగే ఉన్నా..పాటలో చిన్న ఫిలాసఫీ ఉంటుంది. ఈ పాట వినేప్పుడు గమనించండి. అరుణ్‌ చిలువేరు బ్యూటిఫుల్‌గా కంపోజ్‌ చేశాడు. క్యాచీ ట్యూన్‌ ఇచ్చారు. మల్లెగోడ గంగాప్రసాద్‌ బ్యూటిఫుల్‌ లిరిక్స్‌ ఇచ్చారు. వింటూ ఉంటే ఈ పాట ఇంకా బాగా నచ్చుతుంది’ అని హీరో చైతన్య రావ్‌ అన్నారు.
డైరెక్టర్‌ కుమారస్వామి మాట్లాడుతూ, ‘వెస్ట్రన్‌ స్టైల్‌ ట్యూన్‌లో తెలంగాణ సాహిత్యంతో ఈ పాటను రూపొందించాం. ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి’ అని తెలిపారు.

Spread the love