నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
వికలాంగులకు ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకొని రూ.1000 రూపాయలు పెన్షన్ పెంచడాన్ని హర్షిస్తూ వికలాంగులు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వచ్చే నెల నుండి రూ. 4016 రూపాయలు పెన్షన్ ఇవ్వడం పట్ల వికలాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గంటల లింగయ్య, కాయిత నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మెడబోయిన వెంకటేష్ మరియు కోహెడ మండల అధ్యక్షులు చిట్యాల సంపత్ సభ్యులు పాల్గొన్నారు.