సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం 

నవతెలంగాణ-నసురుల్లాబాద్ 
తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను కాంగ్రెస్ నేతలు బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నసురుల్లా బాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ అధ్వర్యంలో  సోనియా గాంధీ చిత్రపటానికి నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ అరిగే సాయిలు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను కాంగ్రెస్ నేతలు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ పట్టణంలో పలువురు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సోనియా గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేసుకున్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ ఆకాంక్ష నెరవేరేది కాదని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తుచేశారు. ఈ  కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరిగే సాయిలు, మాజీ ఎంపిటిసి కృష్ణ గౌడ్ , మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్ , మండల మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్,  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ , ఉపాధ్యక్షులు నర్సింగ్,  మండల  కార్యదర్శి శివప్రసాద్ రవి , అయినాల లింగం,   తుమ్ సాయ గౌడ్, బాన్సువాడ విఠల్, విఠల్ రాజు,  మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love