చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనుముల రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల కోసం నేతన్న అభయ హస్తం పథకం, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు ప్రవేశపెట్టినందుకు గాను రూ.168 కోట్లు 2025వ సంవత్సరమునకు సంక్రాంతి పండుగ కానుక సందర్భంగా నిధులు విడుదల చేసినందుకు మా భువనగిరి చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో సంఘ అధ్యక్షులు గర్దాసు బాలయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటం మనకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ యొక్క పథకములను ప్రవేశపెట్టడంతో నేతన్నలకలలో ఆనందం కనబడుతుంది అని బాలయ్య హర్షం వ్యక్తం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు ఈ యొక్క సంఘ కార్యదర్శి ఎలగందుల కరుణాకర్, సంఘ డైరెక్టర్లు అందే కృష్ణ, ఏలే నరసింహ, కస్తూరి శ్రీనివాస్, శ్రీరామదాసు బాలయ్య, కూరపాటి భద్రమ్మ, సంఘ కార్యకర్త బర్రింకల రమేష్, సంఘ సభ్యులు ఎలగందుల సత్యనారాయణ, రచ్చ నాగయ్య, గర్దాసు కిష్టయ్య, తీరం దాసు దానయ్య, గర్దాస్ నరసింహ, గర్దాసు లలిత పాల్గొన్నారు.