సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, చిత్రపటాలకు పాలాభిషేకం

నవతెలంగాణ – మద్నూర్ 

మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్యారెంటీల అమలుపై విజయోత్సవ సభ నిర్వహించి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి  మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, జి సాహెబ్ రావు హనుమాన్లు స్వామి ధరాస్ సాయిలు వట్నాల రమేష్ సచిన్ బాలు యాదవ్ సంగమేశ్వర్ రాం పటేల్ తాజా మాజీ సర్పంచ్ సంతోష పటేల్ యూనిస్ పటేల్ తాజా మాజీ సర్పంచ్ గోవింద్ రచ్చ కుశాల్ సంతోష్ మేస్త్రి నాగేష్ పటేల్ జావిద్ పటేల్ రైస్ కాన్ ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
Spread the love