– టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి
– వంశీచంద్ రెడ్డితో కలిసి యాత్రలో పాల్గొన్న కడ్తాల్ నాయకులు
నవతెలంగాణ – ఆమనగల్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాలమూర్ న్యాయ యాత్ర కొనసాగుతుందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి చేపడుతున్న పాలమూరు న్యాయ యాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. సోమవారం నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలంలో కొనసాగుతున్న పాదయాత్రలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో వంశీచంద్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా వంశీచంద్ రెడ్డి తోపాటు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డిని వారు సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆమనగల్ మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్ బీక్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, మాజీ ఎంపీటీసీ సభ్యులు గురిగల్ల లక్ష్మయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కేతావత్ హీరాసింగ్ నాయక్, నాయకులు కేతావత్ తులసి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.