పాలపిట్ట కథల పోటీ ఫలితాలు

అరిశా సత్యనారాయణ – అరిశా ఆదిలక్ష్మిల జ్ఞాపకాల స్ఫూర్తిని కేంద్రంగా చేసుకొని పాలపిట్ట నిర్వహించిన కథల పోటీ ఫలితాలు వెల్లడించారు. మొదటి, రెండో, మూడో బహుమతులకు శాంతినారాయణ – గీతలు చెడిపి…; టి.వి.ఎల్‌. గాయత్రి- తోడు; కోటమర్తి రాధా హిమబిందు – ఈతరం కథతో పాటు 5 ప్రత్యేక బహుమతులకు కపాకర్‌ పోతుల – సీతపిన్ని, నాదెళ్ల అనురాధ – మౌనం రాగమైన వేళ!, జడా సుబ్బారావు – పగటి చూపు, సాగర్ల సత్తయ్య – తోడేళ్ళు, గన్నవరపు నరసింహమూర్తి – మంచితనం ఎంపికైనట్లు నిర్వాకులు గుడిపాటి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జూన్‌ 2న ‘గాజుపూలు’ ఆవిష్కరణ
మణీందర్‌ గరికపాటి కవితా సంపుటి ‘గాజుపూలు’ జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జూన్‌ 2న ఖమ్మంలోని నాయుడిపేట బిబియం స్కూల్‌ నందు నిర్వహించనున్నారు. మువ్వా శ్రీనివారావు అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు ఆచార్య పులికొండ సుబ్బాచారి, వంశీకష్ణ, గోపాల కష్ణ, షుకూర్‌, హవీలా, కోండ్రు బ్రహ్మం పాల్గొంటారని నిర్వాహకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాలు
దేశభక్తి – పురోగతి – జాతీయత ప్రధానాంశాలుగా పాలపిట్ట- వాసా ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన డా. వాసా ప్రభావతి కవితల పోటీ ఫలితాలు వెల్లడించారు. మొదటి, రెండో, మూడో బహుమతులుగా శోకం లేని లోకం – నెల్లుట్ల రమాదేవి, రేపటి సూర్యోదయం కోసం – పల్లా రోహిణీకుమార్‌, అమతోత్సవాల ప్రగతి స్ఫూర్తి – రాజా మానాపురం చంద్రశేఖర్‌ కవితలు ఎంపికయ్యాయి. వీటితో పాటు కరిపె రాజ్‌కుమార్‌, స్వప్న మేకల, అల్లాడి శ్రీనివాస్‌, దాసరి మోహన్‌, వేల్పుల రాజు, బొప్పెన వెంకటేష్‌, శ్రీకాంత్‌ బింగి, బి. కళాగోపాల్‌ కవితలు ప్రత్యేక బహుమతులకు ఎంపికయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జూన్‌ 6న హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో నిర్వహించే సభలో బహుమతులు అందజేయనున్నారు.

Spread the love