నల్గొండలో నిలిచిపోయిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

నవతెలంగాణ నల్గొండ:  నల్గొండ జిల్లాలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మాడుగులపల్లికి చెందిన చెన్నయ్య ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకుని రైలు పట్టాలపై నుంచి అవతలికి దాటేందుకు యత్నించాడు. ఇంతలో ట్రాక్టర్‌ ట్రాలీ చెరువుపల్లి వెళ్లే మార్గంలో పట్టాలపై ఇరుక్కుపోయింది. నిత్యం రద్దిగా ఉండే మార్గం కావడంతో  స్థానికులు వెంటనే అప్రమత్తం అయి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు నుంచి హైదరాబాద్‌ వస్తుంది. అప్పటికే రైల్వే అధికారులకు సమాచారం ఉండటంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను కుక్కడం రైల్వేస్టేషన్‌లో కొద్దిసేపు నిలిపేశారు. అనంతరం జేసీబీతో పట్టాలపై నిలిచిపోయిన ట్రాక్టర్‌ను తొలగించారు. దీంతో రైలు అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి. అరగంట పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Spread the love