– కుక్కల వైరస్ సోకి గ్రామస్తులు భయాందోలన
– ప్రతి ఇంట్లో ఒకరు వైరస్ బాధితులు
– కుక్కలను నియంత్రించాలని వినతి
నవతెలంగాణ – పెద్దవూర
గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలు ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి . విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కుక్కలకు పార్వో వైరస్ సోకి గ్రామ ప్రజలను భయాఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కడ నుంచి వచ్చాయో కానీ తండాలో 70 కి పైగా కుక్కలు వున్నాయి. అందులో దాదాపు 30 కుక్కలకు పైగా పార్వో వైరస్ సోకింది. మండలం పరిధిలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సుమారు 69 నుంచి 100 వీధి కుక్కలు ఉంటాయి. గ్రామాల్లో స్వేచ్ఛగా స్వర విహారం చేస్తూ, కనబడిన వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా పోయింది.పలు గ్రామాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి . పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కుక్కలు దాడికి పాల్పడుతున్నాయి. దాంతో రాత్రిళ్లు ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది.
మూగ జీవాల పైన దాడి: మండల వ్యాప్తంగా కుక్కల దాడిలో పలువురి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి .గత కొద్ది రోజుల క్రితం కుక్కలు అవుదూడను చీల్చి చంపాయి.ఈ విధంగా కుక్కల దాడిలో గొర్రెలు, లేగ దూడలు మృత్యువాత చెందటంతో పాడిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారు.
పార్వో వైరస్ అంటే: కుక్కలకు పార్వో అనేది కనైన్ పార్వోవైరస్-2 సీపివీటు వల్ల వచ్చే రక్తస్రావ గ్యాస్ట్రోఎంటెరిటిస్ యొక్క ఒక రూపం. అయినప్పటికీ, వివిధ జంతువులను ప్రభావితం చేసే ఇతర పార్వోవైరస్లు ఉన్నాయి. మరియు చాలా అరుదుగా సీపివీటు నవజాత, ముసలి కుక్కపిల్లలకు సోకినట్లయితే గుండె సంబంధిత లక్షణాలను కలిగిస్తుంది.పార్వో వైరస్ సోకితే, చికిత్స చేయకపోతే 2 నుండి 3 రోజులలో చిన్న కుక్కపిల్ల చనిపోవచ్చు మరియు దూకుడుగా చికిత్స చేసినప్పటికీ, కొన్ని కుక్కపిల్లలు పాపం ఈ వైరస్‌కు లొంగిపోతాయి. కానీ కొన్ని కుక్కలకు శరీరంపై బొగ్గలు, చీము, రక్తం కారి ఒక కుక్క నుంచి మరోక కుక్కకు వ్యాపిస్తుంది. అలాంటి కుక్కను కుట్టిన దోమ మనుషులకు కుట్టడం వల్ల వారికీ ఈ వ్యాది సోకుతుంది. ప్రస్తుతం అన్నీ గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండలం లోని పాల్తీ తండా గ్రామం లో ఈ వైరస్ వల్ల చాలామంది జ్వరాలు, నొప్పులతో బాధపడుతున్నామని వెంటనే సంభందిత అధికారులు కుక్కలను లేకుండా నియంత్రణ చేయాలని కోరుతున్నారు.
కుక్కల వలనే వైరస్ జ్వరాలు వస్తున్నాయి: పాల్తీ రఘు.. పాల్తీ తండా..
మాగ్రామం దాదాపు 70 కుక్కలు వున్నాయి. అందులో సాగానికి పైగా వైరస్ సోకింది. బొబ్బలు, పుండ్లు, ఏర్పడి రక్తం, చీము కారుతుంది. కుక్కలను కుట్టిన దోమలు మమ్మలి కుట్టడం తో చాలా మంది వైరస్ జ్వరాలు, నొప్పులులతో బాధపడుతున్నారు.
కుక్కలను నియత్రించాలి: నేనావత్ శ్రీను.. పాల్తీ తండా
కుక్కలు మేక, గొర్ల పిల్లలను చీల్చి చంపు తున్నాయి. మనుషుల పై ఎగబడుతున్నాయి. వెహికిల్ మీద వెళ్లే వారిని వేగంగా వెళ్లి గాయాలు
చేస్తూన్నాయి. చిన్న పిల్లలు, మహిళల వెంట పడుతున్నాయి. ప్రతి క్షణం భయంగా వుంది సంబంధందిత అధికారులు కుక్కలను నియంత్రణ చేయాలి.