పవన్‌కు పంచాయతీరాజ్‌

Panchayat Raj for Pawan– ఐటీ మంత్రిగా లోకేష్‌
– అనితకు హోంమంత్రిత్వ శాఖ
– పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు
– ఏపీలో శాఖల కేటాయింపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గానికి శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదలైంది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి చెందిన సభ్యులు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సచివాలయంలో సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం సహా ఆయా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత పాలనకుఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని మంత్రులకు చంద్రబాబు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సచివాలయంలో ఉండాలనీ, కచ్చితంగా సమయ పాలన పాటించాలని నిర్ణయించారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్‌ భేటీ నిర్వహించే అవకాశముందని తెలిసింది. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రతిరోజూ సచివాలయానికి మంత్రులు రావాలని తనను కలిసిన మంత్రులకు చంద్రబాబు సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలనీ, పాలనాపరంగా పూర్తిస్థాయి అవగాహన ఏర్పరచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మంత్రులు… శాఖలు
1. చంద్రబాబు : సీఎం, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
2. పవన్‌కల్యాణ్‌ : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖలు
3. లోకేష్‌ : విద్యాశాఖ, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్‌, ఆర్టీజీ
4. అచ్చెన్నాయుడు : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్య్స శాఖ
5. కొల్లు రవీంద్ర : గనులు, భూగర్భ, అబ్కారీ శాఖ
6. నాదెండ్ల మనోహర్‌ : ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
7. పి నారాయణ: పురపాలక, పట్టణాభివద్ధి
8. వంగలపూడి అనిత: హౌం, విపత్తుల నిర్వహణ
9. ఆనం రాం నారాయణ రెడ్డి: దేవదాయ శాఖ
10. పయ్యావుల కేశవ్‌: ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు శాఖ
11. కొలుసు పార్థసారథి: గహ, సమాచార, పౌర సంబంధాలు
12. గొట్టిపాటి రవికుమార్‌: విద్యుత్‌
13. సత్యకుమార్‌ యాదవ్‌: ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య
14. ఎన్‌.రామానాయుడు : జలవనరుల అభివృద్ధి
15. ఎన్‌ఎండీ ఫరూక్‌ : న్యాయ, జస్టిస్‌, మైనార్టీ సంక్షేమం
16.బాల వీరాంజనేయస్వామి : సాంఘీక సంక్షేమం, సచివాలయం
17. గొట్టిపాటి రవి : విద్యుత్‌
18. కందుల దుర్గేష్‌ : పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
29. జి. సంధారాణి : మహిళా శిశుసంక్షేమం, గిరిజన సంక్షేమం
20. బీసీ జనార్థన్‌రెడ్డి : రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
21. టీజీ భరత్‌ : పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి
22. ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం,హ్యాండ్లూమ్స్‌, టెక్‌టైల్స్‌త
23. వాసంశెట్టి సుభాష్‌ : కార్మిక, కర్మాగార, బాయిలర్లు, వైద్యబీమా సేవలు
24. కొండపల్లి శ్రీనివాస్‌: ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ, సాధికారత, సంబంధాలు
25. ఎం. రాంప్రసాద్‌రెడ్డి : రమాణా, యువజన,క్రీడలు

Spread the love