పంచాయితీ కార్మికులను పర్మినెంట్ చేయాలి: సీఐటీయూ అర్జున్

Panchayat workers should be made permanent: CITU Arjunనవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ కార్మికులను  పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని,పీఆర్సీ పరిధిలోకి కార్మికులను తీసుకురావాలని  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు సమస్యల పరిష్కరించాలని చేపట్టిన ఒక్క రోజు సమ్మెలో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సమ్మె నిర్వహించారు.  ఈ సందర్భంగా గ్రామపంచాయతీ మండల నాయకులు వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగిన సభలో అర్జున్ మాట్లాడుతూ అర్హులైన వారిని కార్యదర్శులుగా నియమించాలని,జీవో 51 ని సవరించాలని,విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని,వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్,దహన సంస్కారాల కు రూ.30 వేలు రూపాయలు ఇవ్వాలని వయసు మీరింది అనే పేరుతో ఉద్యోగాలను తొలిగించి వద్దని అన్నారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల ను అనేక భ్రమలు పెట్టిందని ఆనాడు సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు టెంట్ దగ్గరకు వచ్చి అనేక హామీలు ఇచ్చారని కానీ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంతవరకు వారి డిమాండ్లను నెరవేర్చలేదని, పెండింగ్ వేతనాలు ఇవ్వలేదని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం  పునరాలోచన చేసి వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్ లను నెరవేర్చాలని లేనియెడల భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నరసింహారావు,యూనియన్ నాయకులు ముత్తారావు,బుజ్జమ్మ, మహేష్,మల్లయ్య,భూషణం, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love