డీపీఓకి వినతిపత్రం ఇచ్చిన పంచాయతీ కార్మికులు

నవతెలంగాణ-భిక్కనూర్
జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావుకు మండల గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు భిక్నూర్‌ పట్టణంలో ఇతరుల చేత పారిశుద్ధ పనులు చేపడుతుండగా ధర్న చేస్తున్న పంచాయతీ కార్మికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపిఓ ప్రవీణ్ కుమార్, ఎస్సై ఆనంద్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని పారిశుద్ధ పనులను అడ్డుకోవడం సమంజసం కాదని మీ సమస్యలను వినతిపత్రం ద్వారా అందజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలపడంతో డిపిఓ కు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.

Spread the love