ప్రయాణ ప్రాంగణంలో పంచాయతీలు..!

– మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణ దుస్థితి 

నవతెలంగాణ – బెజ్జంకి 
లక్షలు వెచ్చించి నిర్మించి, రంగు రంగులతో సుందరంగా తీర్చిదిద్దిన ఆర్టీసీ ప్రయాణం ప్రాంగణం ప్రయాణీకుల్లేక వెలవెలబోతుంది. పలువురు పంచాయతీదారులు ప్రాంగణాన్ని ఆసరాగా చేసుకుని వారి నిర్ణయాలకు అడ్డగా మార్చుకుంటున్నారు. గతంలో అధ్వానస్థితిలో ఉన్న ప్రయాణ ప్రాంగణాన్ని ఆర్టీసీ అధికారులు గత కొద్ది నెలల క్రితం సుందరీకరణ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. పంచాయతీదారులకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వేదికవ్వడంతోనే ప్రయాణీకులు ప్రాంగణంలోకి వేళ్లేందుకు ఆసక్తి చూపడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబధిత ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చోరవ చూపి పంచాయతీలకు నిలయంగా మారిన ప్రయాణ ప్రాంగణాన్ని ప్రయాణీకులకు వినియోగమయ్యేల సత్వర చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Spread the love