పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన…

నవతెలంగాణ – హైదరాబాద్
పవర్ కపుల్ అని పిలవబడుతున్న రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెలకి పండంటి పాపాయి పుట్టింది. సోమవారం సాయంత్రం ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె వెంట, భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్ అందరూ వెంట రాగ నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చేరిన ఉపాసన ఈరోజు అంటే మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మ ఇచ్చిందని ఆసుపత్రి ఒక ప్రత్యేక మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. ఇటు మెగా కుటుంబంలో, అటు కామినేని కుటుంబంలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయాడని అతని సన్నిహితులు చెప్పారు. ఈరోజు రెండు కుటుంబాలకి చెందిన సభ్యులు ఆసుపత్రికి వచ్చి రామ్ చరణ్, ఉపాసనలకి అభినందనలు తెలుపుతూ, అలాగే పుట్టిన పాపాయికి ఆశీర్వచనములు కూడా చెపుతారని మెగా ఫామిలీ టీం ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని రోజుల నుండి రామ్ చరణ్, ఉపాసన లు వార్తలే ఎక్కడ చూసిన వైరల్ అయ్యాయి. ముందుగా ఉపాసన డెలివరీ డేట్ జులై అనుకున్నారు, కానీ తరువాత జూన్ 20 అని కన్ఫర్మ్ చేశారు, నిన్న ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు. అపోలో హాస్పిటల్ లో ఉపాసన కోసమని ఒక ప్రత్యేక రూమ్ సిద్ధం చేసి ఉంచారు.

Spread the love