మృతుని కుటుంబానికి చేయూత అందించిన పాండు రంగారెడ్డి

– మనోధైర్యం.. మానవత్వం చాటిన బుసిరెడ్డి పౌండేషన్
– అండగా నేను వుంటా అన్నివిధాలుగా ఆదుకుంటా
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం,కొంపల్లి గ్రామవాస్తవ్యులు అయినటువంటి పగడాల బొబ్బిలి రెడ్డి స్వర్గస్తులు అయినారని తెలుసుకుని వారి కుటుంబానికి అండగా నేను వున్నానంటూ బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సోమవారం భోజనాలు పంపించడం జరిగింది. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరడమైనది.ఈసందర్బంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనదని దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమే.భగవంతుడు ఇచ్చిన సంపదలో ఒకటని అన్నారు.మనిషి బ్రతికివున్నన్ని రోజులు, అహంబ్రహ్మస్మి” భావనతో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నానని తెలిపారు.నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.

Spread the love