ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాండురంగారెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి సాగర్ మండలం  తూటిపేట తండ గ్రామ పంచాయతీ పరిధిలో గల కొనేటిపురం తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి ఆహ్వానం మేరకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిశనివారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి కళ్యాణ మహోత్సవం(తలంబ్రాలు) శ్రీ రాయప్రోలు మురళీ స్వామి గారిచే అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ  సందర్బంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ చుట్టూ అందమైన ప్రకృతి నడుమ తిరుమలనాథ స్వామి దర్శనం చేసుకోవడం అనేది ఎంతో అనుభూతి కలుగుతుంది అని అన్నారు.భక్తులు విశేష పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు.తదనంతరం ప్రసాద వితరణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం వేళలో ఎడ్ల పందాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, షేక్ ముస్తాఫ, వెటర్నరీ డాక్టర్ అజ్మీర్,సంజీవరెడ్డి, శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి, రిక్కల రామకృష్ణా రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్,గౌరు శ్రీనాధ్, వెంకట్,ఆంగోతు సురేష్,దేపావత్ శ్రీను నాయక్, వంగాల భాస్కర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి, సతీష్,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, సెక్రటరీ రామకృష్ణా రెడ్డి,ఇస్రం లింగస్వామి,గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, పాతనబోయిన కోటేష్, ఇస్రం ప్రశాంత్, మల్లిఖార్జున చారి, రమేష్ చారి,బ్రహ్మం మరియు తదితరులు పాల్గొన్నారు.
Spread the love