చరిత్ర సృష్టించిన పంత్

నవతెలంగాణ – హైరదాబాద్: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు నెలకొల్పారు. ఈ ఎడిషన్‌లో ఆయన 10 క్యాచ్‌లు అందుకున్నారు. ఈ క్రమంలో గిల్‌క్రిస్ట్ (7) రికార్డును పంత్ బ్రేక్ చేశారు. కాగా ఈ మెగా టోర్నీలో పంత్ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నారు. భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు.

Spread the love