పంతులమ్మ ప్రేమ పాఠాలు.. విద్యార్థి బలవన్మరణం

నవతెలంగాణ – నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల్ల రాంపూర్‌పెంటకు చెందిన చిగుర్ల రాముడు (19) అనే చెంచు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.  తెల్లావారితే పాఠశాలకు రావాలి. కానీ, అంతలోనే అతడు అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర అందోళ వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చిగుర్ల రాముడు అనే విద్యార్థి అచ్చంపేట మండలంలో ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో అదే పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విద్యా బుద్ధులు పాఠాలు చెప్పాల్సింది పోయి, అతడితో సన్నిహితంగా ఉంటూ ప్రేమ పాఠాలు చెప్పింది. ఆ విద్యార్థిని వశపరుచుకుని, సన్నిహితంగా ఉండసాగింది.  అయితే, ఆ టీచర్ కు భర్త ఉన్నప్పటికీ విద్యార్థితో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని అనుకుంది. ఈ క్రమంలో వారిద్దరూ కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారనే సమాచారం టీచర్ భర్తకు తెలిసింది. దీంతో టీచరమ్మ రాముడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారించింది. అనంతరం సరిగ్గా మూడు క్రితం రాముడు అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Spread the love