ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల సహకారం అవసరం..

Parents' cooperation is necessary for the strengthening of government schools.– కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ హెచ్ఎం సుధాకర్  
– పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి
ప్రభుత్వ పాఠశాలల బలుపేతానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ అన్నారు. శనివారం మండలంలోని కాటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల, పాఠశాలల అభివృద్ధి, మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాల అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలకు రెగ్యులర్గా హాజరయ్యెల చూడాలని, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కోరారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం ప్రతినెల మూడో శనివారం జరుగుతుందని తల్లిదండ్రులందరూ హాజరై పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యాపరమైన పురోగతి అభ్యాస ఫలితాల సాధన, పాఠశాల సౌకర్యాల మెరుగుదల, మధ్యాహ్న భోజనం మొదలైన వంటి గురించి చర్చించుకుని పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు పాలకుర్తి రోజా రాణి, ఉపాధ్యాయులు గోరంట్ల రాజేష్, సక్రు నాయక్, జీవన్ లాల్, సుతారి పాపారావు, కె సమ్మయ్య, అక్బర్ పాషా, జైపాల్ మరియు మిగతా ఉపాధ్యాయ బృందం, పేరెంట్స్ గండు బిక్షపతి, ఓర్సు ఎల్లయ్య, ఉపేందర్, సాయిరి శ్రీను, రియాజ్, వడ్కపురం సారయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love